Sep 26,2023 23:11

లెక్కలంటే భయం తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే..

లెక్కలంటే భయం తొలగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే..
ప్రజాశక్తి-పాకాల: చిన్నతనం నుండి విద్యార్థుల్లో గణితం పై భయం పోగొట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని బాబ్జి అన్నారు. మండలంలోని దామలచెరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మంగళవారం పాకాల, చంద్రగిరి, రామచంద్రా పురం మండలాలకు చెందిన ఉపాధ్యాయుల సమావేశంలో బాబ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుండి గణితం అంటే ఏదో భయంతో ఉంటారన్నారు. ఆ భయాన్ని పొగోట్టాలని, నిజానికి అర్థం చేసుకుంటే అన్ని విషయాలలో కెల్లా గణితం సులభంగా ఉంటుందన్నారు. ఒక పిల్లవాడికి గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం వస్తే ఇంక అన్ని సులభంగా నేర్చుకోచ్చన్నారు. ఎంఇవో 2 లింగయ్య మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒకటి లక్ష్యం ఉంటుందని దాన్ని నెరవేర్చుకొనే క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని తమ కలలను సాధించుకోవాలన్నారు. నిరంతరం విద్యార్థులు రాసిన వర్క్‌ బుక్స్‌ ను చూడాలన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు గురించి విద్యార్థులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌సి ప్రధానోపాధ్యా యులు నాగరాజ, సంయుక్త కార్యదర్శులు విజరు, మోహన,్‌ రెడ్డెప్ప, వెంకట స్వామి, సిఆర్‌పిలు శ్రీనివాసులు, ముని కష్ణ పాల్గొన్నారు.