Mar 02,2023 00:08

లేగ దూడలను పరిశీలిస్తున్న ప్రసాద్‌రావు


ప్రజాశక్తి- చీడికాడ :మండలంలోని జైతవరం గ్రామంలో లేగ దూడల ప్రదర్శనను జిల్లా పశుసంవర్ధక శాఖ సంచాలకులు బి.ప్రసాద్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ రావు మాట్లాడుతూ, పెయ్యి పుట్టిన వెంటనే వాటికి ముర్రుపాలు తాగించాలని, ప్రతి నెల పాముల మందు పట్టించాలన్నారు. ఆడ పెయ్యలు పుట్టాలంటే కొత్త పథకం (పేయ్య దొడల ఉత్పత్తి పథకం )ద్వారా రైతులు ఉపయోగించవచ్చు అన్నారు. పశువులకు పాడి పెయ్యలకు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత గాలి కుంటి వ్యాధి రాకుండా, టీకాలు వేయించుకోవాలన్నారు. పశుగణాభివృద్ధి సంస్థ సంచాలకులు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణను రైతులందరూ వినియోగించుకోవాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుని రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్‌ వి.చిట్టి నాయుడు, వైద్యులు భాను, గాయత్రీ దేవి, అనుపమ, గణేశ్వరరావు, మణి లక్ష్మణ్‌, అరుణ్‌ కిరణ్‌, పాడి రైతులు పాల్గొన్నారు.