లే అవుట్‌లో పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : జగనన్న సురక్ష సర్వేను జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా పంచాయతీ అధికారిణి సుస్మితారెడ్డి పరిశీలించారు. శనివారం మండల పరిధిలోని శకునాలపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న జగనన్న సురక్ష సర్వేను పరిశీలించి అలాగే జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా అధికారిని సుస్మితా రెడ్డి పరిశీలించారు. అనంతరం సచివాలయం తనిఖీ చేసి సిబ్బంది శాఖ సంబంధిత వ్యక్తిగత రిజిస్టర్‌లు తనిఖీ చేశారు. జగనన్నకు చెబుదాము కార్యక్రమంను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ పనుల పురోగతి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సురక్ష సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని అలాగే జగనన్న లేఅవుట్‌లో జరుగుతున్న నిర్మాణాలను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శి కరిముల్లా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ షరీఫ్, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.










