డైరెక్టర్‌ను సన్మానిస్తున్న వైసిపి నాయకులు
చర్మకారుల కోసం లెదర్‌పార్కు ఏర్పాటు చేయాలని వైసిపి నాయకులు గొడుగునూరు రాజశేఖర్, గొడుగునూరు ప్రతాప్, దళితనాయకులు ఓబయ్య, గొల్లపల్లె సుధాకర్ కోరారు. బుధవారం ఎపి లీడ్‌క్యాప్ డైరెక్టర్ కష్ణామూర్తిని వారు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్‌లోని చెన్నంపల్లె పొలం సర్వే నంబర్ 5080లో 3.64 ఎకరాల ప్రభుత్వ భూమిలో లెదర్ పార్కు ఏర్పాటు చేసి బద్వేల్, గోపవరం, బి. కోడూరు మండలాల చర్మకారులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈవిషయంపె లీడ్ క్యాప్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎపి లీడ్‌క్యాప్










