\జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి మౌలిక సౌకర్యాలు
ప్రజాశక్తి- సీతమ్మధార : జగనన్న ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు కోరుకున్నట్లే ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రభుత్వం ఇస్తుందని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు అన్నారు. గురువారం ఎఎస్‌ఆర్ నగర్ సచివాలయ ప్రాంగణంలో 48,49 వార్డులకు సంబంధించి లబ్ధిదారులకు 49వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ అల్లు శంకరరావు, 48వ వార్డు ఇన్‌ఛార్జి నీలి రవి ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగనన్న కాలనీల్లో పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రి, తాగునీటి సౌకర్యం, రోడ్లు ఇతరత్రా మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.అంతేకాక లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80లక్షల సాయం అందించడంతోపాటు ఉచితంగా ఇసుక ఇస్తుందని, అలాగే డ్వాక్రా లబ్ధిదారులకు రూ.35వేలు బ్యాంకు రుణం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐదో జోన్ కమిషనర్ మల్లయ్య నాయుడు, ఎపిడిలు పద్మ, యన్.రవికుమార్, ఐ.రవికుమార్, కర్రి రామారెడ్డి, పద్మ, అప్పారావు, భూలోక, సరస్వతమ్మ, శకుంతల, శ్యామల, మంగ, సూర్యనారాయణ, శివప్రసాద్, శంకర్, మున్నా, శ్రీను, కిషోర్, జాన్సన్, శ్రీరామ్, భరత్, హేమంత్ పాల్గొన్నారు.
57 వార్డులో ...
కంచరపాలెం : 57వ వార్డు శ్యామ్‌నగర్, భరత్‌నగర్ కాలనీలో కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మళ్లా విజయాప్రసాద్, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ ఆదేశాలతో ఇప్పటివరకు 286ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశామన్నారు.










