Jul 05,2023 00:19

లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - యలమంచిలి
యలమంచిలి రామనగర్‌లోని టిడ్కో ఇళ్లు 432 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే యువి.రమణమూర్తి రాజు చేతుల మీదగా అప్పగించారు. మంగళవారం యలమంచిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సమావేశంలో ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు సమకూర్చి అందజేయాలనే లక్ష్యంతోనే కాస్త ఆలస్యమైందని తెలిపారు. అధ్యక్షత వహించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి మాట్లాడుతూ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి, నీటి శుద్ది ప్లాంట్‌, సిమ్మెంట్‌ రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. జాతీయ రహదారిని అనుకొని నిర్మించడంతో మంచి ఖరీదైన, విలువైన ఇళ్లుగా భావించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వీరయ్య మాట్లాడుతూ నీటిసరఫరా, విద్యుత్‌ మీటరు మొదలైన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ సుకుమార్‌వర్మ, టిడ్కో ఇంజనీర్లు అహ్మద్‌, అనూష, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపు గుప్తా, టౌన్‌ పార్టీ అధ్యక్షలు బొద్దపు ఎర్రయ్యదొర, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాస్‌, మేనేజరు డి.ప్రభాకరరావు, అక్కౌంట్స్‌ ఆఫీసర్‌ పుష్పవతి, రెవెన్యూ అఫీసర్‌ నీలిమ, టిపిఓ, వై లక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ డి.అప్పారావు, నాయకులు దాసరి కుమార్‌, కోడిగుడ్డు రమణ, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.