Aug 02,2023 00:19
చెక్కును అందజేస్తున్న మంత్రి నాగార్జున, దేవినేని

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని గోరిగపూడి పంచాయతీ పరిధిలోని దాసరి పాలెంలో మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లలకు మంత్రి నాగార్జున సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. దాసరి పాలెం గ్రామానికి చెందిన గొర్రుముచ్చు రమేష్‌ ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు కాగా వీరు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటున్నారు. దీంతో కుటుంబ పోషణ భారం కావటంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున సందర్శించి రూ.50 వేల ఆర్థిక సాయంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందజే శారు. ఈయన వెంట బాపట్ల జిల్లా అర్బన్‌ డెవలప్మెంట్‌ కమిటీ చైర్మన్‌ దేవినేని మల్లిఖార్జునరావు, వైసిపి నాయకులు ఉన్నారు.