Nov 03,2023 17:45

ప్రజాశక్తి - పోడూరు
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. శుక్రవారం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో తూర్పుపాలెం, జగన్నాథపురం గ్రామాల్లోని లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుబ్బల ఉషారాణి, వీర బ్రహ్మం, గుడాల శిరీష చంటి, ఎంపిపి సబ్బితి సుమంగళి, జెడ్‌పిటిసి గుంటూరి పెద్దిరాజు, కర్రి వాసురెడ్డి పాల్గొన్నారు.