Aug 25,2023 00:02

చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో వివిధ పథకాల కింద అర్హులైన 3066 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 53 లక్షల 19 వేలు ద్వైవార్షిక నగదును లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం నుండి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరుపై ప్రత్యక్ష ప్రచారాన్ని గురువారం కలెక్టరేట్‌ నుండి వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, అమ్మఒడి పథకం కింద 378 మంది లబ్దిదారులకు రూ.56 లక్షల 70 వేలు, చేదోడు 592 మందికి 59 లక్షల 20 వేలు, ఈబిసి నేస్తం 13 మందికి రూ.1లక్ష 95 వేలు, జగనన్న విద్యాదీవెన కింద 625 మందికి రూ.58 లక్షల 65 వేల 398, జగనన్న వసతి దీవెన 783 మందికి రూ.84 లక్షల 60 వేల 600లు, రైతు భరోసా 15 మందికి రూ.58 వేలు, వైఎస్సార్‌ క్రాంతి పథం ఆసరా కింద 660 స్వయం సహాయ సంఘాలకులు రూ.91 లక్ష 49 వేల 960లను లబ్దిదారులకు ఖాతాలకు ముఖ్యమంత్రి జమ చేసారని చెప్పారు. లబ్దిదారులకు నమూనా చెక్కు పంపిణీ చేసారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌ డిఏ, పిడి వి.మురళి, పలువురు ఎపిఎంలు, స్వయం సహాయ సంఘాల సభ్యులు, పలువురు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.