ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ సాగు భూమిలో వినియోగిస్తున్న వ్యవసాయ విద్యుత్ సర్వీస్‌ను తొలగించిన కేతవరం గ్రామ లైన్‌మేన్ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మండలంలోని కేతవరం గ్రామస్తులు వామిశెట్టి నరసురావు అధికారులను కోరారు. సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్‌డిఒ జాన్సీరాణికి వినతిని అందించారు. ఈ సందర్భంగా వామిశెట్టి నరసురావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మా తాతగారి నుంచి సంక్రమించిన భూమిలో వారసత్వంగా మా అమ్మగారైన వామిశెట్టి మణమ్మ పేరున 1378 మోటార్ సర్వీస్ నెంబర్‌తో గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ బోరు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రామ లైన్‌మేన్ జలపాల నాగరాజు ఎటువంటి సమాచారం లేకుండా వరి, కొబ్బరి మొక్కలతో సాగులో ఉన్న మా పంటకు నీటి సదుపాయం లేకుండా కరెంటును అక్రమంగా తొలగించినారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లైన్‌మేన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.










