లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల సమస్యను సీరియస్‌గా తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని, 2013 నాటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లో శ్రామిక మహిళా నేతలు ఎన్.వాణీశ్రీ, బుజ్జి, పి.హేమలత, జయంతి, సాయిలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తిరుపతి జిల్లాలో స్థానిక కమిటీ పనిలో లేదని, అసలు కమిటీ ఉన్నట్లుగా జిల్లా ప్రజానీకానికి తెలియదని, సమస్యలను ఎవరికి వివరించాలో అర్ధం కాని పరిస్థితిలో మహిళలు ఉన్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ మొదటివారంలో లైంగిక వేధింపుల సమస్యపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న శ్రామిక మహిళలు










