Sep 28,2023 22:47

సదస్సులో మాట్లాడుతున్న వాణీశ్రీ

లైంగిక వేధింపులపై సమరభేరి
ప్రజాశక్తి - తిరుపతి డెస్క్‌
పని ప్రదేశాలలో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్యపై సమరభేరి మోగించాలని సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన శ్రామిక మహిళా సదస్సు నిర్ణయించింది. యస్‌. వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన సదస్సులో 18 రంగాలకు చెందిన శ్రామిక మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. 2013 వ సంవత్సరంలో పని ప్రదేశంలో శ్రామిక మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటుంటే తీసుకోవలసిన చర్యల గురించి చట్టం ఏర్పడిందని, ఆ చట్టం తిరుపతి జిల్లాలో అమలు కావడం లేదని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నచోట అంతర్గత కమిటీలు ఉండాలని, అనేక చోట్ల ఇలాంటి కమిటీలు లేకపోవడం విచారకరమని వారు విమర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాల్సిన స్థానిక కమిటీ కూడా ఏర్పాటుకు నోచుకోలేదని విమర్శించారు. గతంలో టీటీడీ పరిపాలనా భవనంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సందర్భాన్ని ఉదహరించారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కషి చేయాలన్నారు.30వ తేదీ శనివారం శ్రామిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డిని కలిసి స్థానిక కమిటీ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు జయంతి, సాయిలక్ష్మి హాకర్స్‌ నాయకురాలు బుజ్జి, కస్తూరి (న్యాయవాది) మల్లెల వాణి జ(ర్నలిస్టు), డాక్టర్‌ శ్రావ్య, బిఎన్‌ ప్రసన్న (బ్యాంకు) జి. నాగమణి, ధనలక్ష్మి (ఆటో) ఏ. పద్మజ (ఉపాధ్యాయురాలు), జి. రేవతి (మున్సిపాలిటీ), కే. హేమలత (మెడికల్‌), పి. శశిరేఖ (రైల్వే), చంద్రమ్మ (అగ్రికల్చర్‌ కాలేజ్‌), పద్మలీల, హైమావతి, మంజుల, ముని కుమారి, నాగరాజమ్మ (అంగన్వాడి), సరిత (ఆర్పి), బేబీ రాణి (టిటిడి), త్రివేణి (వాలంటీర్‌) తదితరులు తమ తమ రంగాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను సవివరంగా వివరించారు. వీరికి మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం, కోశాధికారి కెఎన్‌ఎన్‌ ప్రసాదరావు, రమేష్‌, బాలాజీ, ఎం. రఘు, టి సుబ్రహ్మణ్యం, పి మునిరాజ, కే. వేణుగోపాల్‌, టి. మురళి, గంగులప్ప, పార్థసారథి పాల్గొన్నారు...
సదస్సులో మాట్లాడుతున్న వాణీశ్రీ