Oct 06,2023 23:14

ప్రజాశక్తి-పిఠాపురం విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పట్టణంలోని ఒక ప్రైవేట్‌ విద్యాసంస్థలో ఏడో చదువుతున్న బాలికపై సోషల్‌ ఉపాధ్యాయుడు దుర్గారావు లైంగిక వేధింపులకు పాల్పడడంతో గురువారం రాత్రి కీచక టీచర్‌కు విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. తమ బాలికతో ఆసభ్యంగా ప్రవర్తించిన దుర్గారావును పాఠశాల నుంచి తొలగించాలని ప్రిన్సిపల్‌, క్లాస్‌ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పాఠశాల యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుపోవడంతో పాఠశాల ఎదుట శుక్రవారం బంధువులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ ఈ సంఘటనపై శుక్రవారం విచారణ చేపట్టారు. బాలిక తల్లి, బాలికను విషయాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. ఈ విచారణలో కాకినాడ డిఎస్‌పి మురళీధర్‌, సిఐ వైఆర్‌కె.శ్రీనివాస్‌ ఉన్నారు.