Apr 28,2023 00:29

ర్యాలీ చేస్తున్న మహిళలు, గ్రామస్తులు

ప్రజాశక్తి-చోడవరం : చీడికాడ మండలం వరహాపురం గ్రామానికి చెందిన ఎలమంచిలి లక్ష్మి అనే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన ఎలమంచిలి చిన్నను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో గురువారం చోడవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.వరలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 13న లక్ష్మిపై శారీరకంగా, లైంగికంగా ఎలమంచిలి చిన్న దాడికి పాల్పడ్డాడని, దీనిపై బాధితురాలు చీడికాడ పోలీసులకు చేసిందని తెలిపారు. దీనిపై పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి నిందితునికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే వదిలిపెట్టడం దారుణమన్నారు. నిందితునిపై నిర్భయ, దిశ చట్టాల కింద కేసులు పెట్టి వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సంఘటన జరిగి 15 రోజులైనా పోలీసులు నిందితుడిని దాసిపెట్టి, ఆయన అందుబాటులో లేడని చెప్పడం దారుణమన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని, బాధితురాలి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఆర్‌.దేముడు నాయుడు, బాధితురాలు భర్త ఎలమంచిలి రాము, ఎలమంచిలి ఎర్రయ్య, ఎలమంచి మల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగిరెడ్డి సత్యనారాయణ, మిస్క సత్యరావు తదితరులు పాల్గొన్నారు.