May 30,2021 14:17

అదొక ఓక్‌ చెట్టు
శాఖోపశాఖలుగా విస్తరించి
ఊడలు దిగి రారాజుగా
విర్రవీగుతుంది

చిన్న చిన్న మొక్కలను
ఎదగనీయదు
ఎదుగుతున్న మొక్కల చిదుము

అచ్చట రెండు పూలమొక్కలు
రెండూ చేదోడు వాదోడుగా
రాబిన్‌ జారవిడచిన సైక్లామెన్‌ గింజలతో మొక్కలెదిగినా
వాసన వ్యాప్తి లేదు
నేల మొక్క కాదది వలస మొక్క అది
ఫక్క్వా మొక్కల కంటే తక్కువే
దీని పుట్టుక ఇక్కడే మరణమూ ఇక్కడే
తన జాతి బీజాలు పదిలం ఈ నేలలో

ఐనా సైక్లామెన్‌ సాగుకి ఎక్కువ చోటు
ఫక్క్వా సాగుకి తక్కువ చోటు
ఓక్‌ చలువే
తన నేలలో తానే పరాయై అస్తిత్వం కోసం
భూపొరల్లో తండ్లాట ఓక్‌
ఒకదాన్ని చంపి మరొకదాన్ని బతికించే యత్నం సైక్లామెన్‌ని మచ్చిక చేసుకుని
ఫక్క్వా సువాసనను కట్టడి చేయు
నిరంతర కంచెలు

ఎంత తొక్కితే అంత కన్నా
రెట్టింపు వేగంతో ఎదిగే లక్షణం ఫక్క్వాలో
పాలస్తీనా ఫక్క్వా పోరాటం ఫలించేలా
వెన్నుదన్నుగా నిలిచే మానవత్వం
మనలో వుందనే ఋజువు
ఇజ్రాయెల్‌కి చూపెడదాం

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201