Nov 01,2022 23:03

ప్రజాశక్తి - విజయవాడ : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌ గ్రీన్‌ లాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం టిడ్కో గృహాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. ఈకార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్‌, విఎంసిలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ అరవ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్‌ తంగిరాల రామిరెడ్డి చేతుల మీదుగా కష్ణానది రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కారణంగా నిర్వాసితులైన 187 మందికి ఉచితంగా ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు అర్హులైన జాబితాలోని వారికి ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కమిషనర్‌ (జనరల్‌) ఎం.శ్యామల, జాయింట్‌ డైరెక్టర్‌ (అమత్‌) డాక్టర్‌ కె.బి.ఎన్‌.ఎస్‌.లతా, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (యుసిడి) శకుంతల, డిప్యూటీ సిటీ ప్లానర్‌ (ప్లానింగ్‌) జుబిన్‌ శిరన్‌ రారు, జోనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిచంద్‌ పాల్గొన్నారు.