Feb 10,2023 23:20

తరలి పోతున్న చెరుకు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌: కేంద్ర బడ్జెట్‌లో ఎపికి తీవ్ర అన్యాయం జరిగిందని, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు, విశాఖ రైల్వే జోన్‌కి నిధుల కేటాయింపు దారుణంగా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి విమర్శించారు. అదాని అక్రమ సంపాదనపై సమగ్ర దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేయాలని శుక్రవారం రైల్వే డివిజనల్‌ కార్యాలయం (డిఆర్‌ఎం) వద్ద సిపిఐ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. మోడీ మొదటిసారి అధికారం చేపట్టిన సమయంలో దేశ సంపన్న వర్గాల్లో 630 స్థానంలో ఉన్న అదాని గడిసిన 5 ఏళ్ల వ్యవధిలో మొదటి స్థానంలో నిలిచాడన్నారు. మోడీ సర్కార్‌ ప్రోత్సాహాం ఎంతగా ఉందో అర్థమవు తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్‌.కె రెహమాన్‌, పి. చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
గొలుగొండ:కేంద్ర ప్రభుత్వం అండతో దేశ సంపదను కొల్లగొడుతున్న అదాని ఆస్తులను తక్షణమే జప్తు చేసి జాతీయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ నేతలు మండలంలోని కృష్ణదేవిపేటలో అంబేద్కర్‌ సెంటర్‌ నుండి ర్యాలీగా వెళ్లి ఎస్‌బిఐ బ్యాంకు వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ,కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపిలు నరేంద్ర మోడీకి భజన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పనిలో నరేంద్ర మోడీ ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు మౌనం వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మేకా సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు జి.రాధాకృష్ణ, ఎల్‌.బాబులు, జి.సత్యనారాయణ, ఎం.శ్రీరామ్మూర్తి, అప్పలనాయుడు, కె.రాంబాబు, వాసుదేవరావు, పి.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సిపిఐ భీమిలి ఏరియా సమితి ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. ప్రధాని మోడీ డౌన్‌ డౌన్‌, అదాని ఆస్తులన్నీ జప్తు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు అల్లు బాబూరావు, సహాయ కార్యదర్శి కానూరి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు సిహెచ్‌.నరసింహులు, టి సోమరాజు, నాయకులు ఎం వీర్రాజు, సిహెచ్‌.అప్పారావు, జి.సూరిబాబు పాల్గొన్నారు.
అనకాపల్లి: సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ముందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, నాయకులు రాజాన దొరబాబు, కే సన్యాసిరావు, వైఎన్‌ భద్రం, రాజువాన లక్ష్మణ, చెల్లూరి నాగరాజు, నాయుడు మల్లికార్జునరావు, టి వెంకటేశ్వర్లు, సత్యారావు, శ్రీరామదాసు అబ్బులు పాల్గొన్నారు.