రోడ్డుపై నాట్లేస్తున్న స్థానికులు
ప్రజాశక్తి-దుగ్గిరాల : ఎన్నికల సమయంలో వచ్చి దండాలు పెడతారు గెలిచిన తర్వాత ఏదీ పట్టించుకోవటం లేదని మండలంలోని ఈమని గ్రామస్తులు మండిపడ్డారు. కృష్ణా నది నుండి ఇసుక లోడుతో వస్తున్న ఏడెనిమిది లారీలను ఆదివారం సాయంత్రం గ్రామంలో అడ్డుకున్నారు. లారీల వల్ల రోడ్లు అధ్వానంగా తయారవుతున్నారని, ద్విచక్ర వాహనాలు పడిపోతున్నారని, పాఠశాలలకు వెళ్లే పిల్లలు జారి పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. లారీలను రానివొవ్వదని అడిగితే ఎమ్మెల్యే లారీలు అంటున్నారని, గట్టిగా మాట్లాడితే టైర్ల కింద తొక్కిస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రహదారిపై గుంతల్లోని నీటిలో మహిళలు వరి నాట్లు వేశారు.










