ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆర్డిఓ జయరాంకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుక రీచ్ ల నుండి ఇసుకను తరలించి అమ్ముకుంటున్నామన్నారు. ఈనెల 16ున స్థానిక రూరల్ ఎస్సై లారీలను స్టేషన్లోకి తరలించి, ఐదు రోజులుగా వాహనాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమపై ఏమైనా తప్పులు ఉంటే శిక్ష విధించి చర్యలు తీసుకోవాలని, వాహనాలను స్టేషన్ లో ఉంచడం సరికాదన్నారు. రోజులు తరబడి ఉంచడంతో ఇంజిన్, బ్యాటరీ వంటి పరికరాలు పాడయ్యే అవకాశం ఉందని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతామని తెలిపారు.










