Oct 07,2023 21:34

మృతి చెందిన వ్యక్తి కొచ్చర్ల నారాయణరావు

ప్రజాశక్తి - కురుపాం : స్కూటీతో ఆగి ఉన్న వ్యక్తిని లారీ ఢకొీనడంతో ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కురుపాంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కురుపాంలోని జిసిసి కాలనీకి చెందిన కొచ్చర్ల నారాయణరావు (52) మెయిన్‌ రోడ్డు పక్కన తన స్కూటీ మీద కూర్చుని ఆగి ఉన్నాడు. పార్వతీపురం నుండి కురుపాం సమీపంలో కర్రల లోడు నిమిత్తం వస్తున్న లారీ.. స్కూటీని బలంగా ఢకొీంది. దీంతో నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో విధుల నిమిత్తం గుమ్మలక్ష్మీపురం మండలం వెళ్తున్న జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మంతెన వినోద్‌కుమార్‌ సంఘటనా స్థలంలో ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆయన మృతి చెందాడు. నారాయణరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.