
సంఘటనా స్థలంలో మృతి చెందిన పసుపులేటి వెంకటరావు
భోగాపురం: మండల కేంద్రమైన భోగాపురంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు అక్కడకక్కడే మృతి చెందాడు. భోగాపురం గ్రామానికి చెందిన పసుపులేటి వెంకటరావు (60) పొలం పనులు చూసుకొని సైకిల్‌పై ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ముక్కాం వెళ్లే కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢకొీంది. దీంతో ఆయన అక్కడకక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య కొండమ్మతో పాటు కుమార్తై ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.