ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణంపాలయిన ఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద సోమవారం ఉదయం జరిగింది. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలేనికి చెందిన మోపూరి చెన్నకృష్ణారావు, గోవిందమ్మకు ఇద్దరు కుమార్లు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుల రమేష్ (31), బాలకృష్ణ (29) ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. రమేష్ సిఆర్‌పిఎఫ్‌లో జవానుగా పనిచేస్తుండగా బాలకృష్ణ రైల్వేశాఖలో ఉద్యోగిగా ఉన్నారు. రమేష్ విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నారు. రమేష్ విశాఖ వెళ్లేందుకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండటంతో అన్నద మ్ములిద్దరూ ద్విచక్ర వాహనంపై గుంటూరు వస్తుండగా తిమ్మాపురం వద్ద రహదారి మరమ్మతుల దృష్ట్యా వాహనం నడుపుతున్న బాలకృష్ణ నెమ్మదిగా నడుపుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢకొీంది. ఇద్దరిపైనా లారీ దూసుకు వెళ్లడంతో అన్నదమ్ములు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్‌కు భార్య, ఆరునెలల పాప ఉన్నారు. మృతదే హాలను చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.










