May 26,2023 00:25

బోల్తా పడిన లారీ

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో లింగాపురం సెంటర్‌ వద్ద గురువారం ఉదయం లారీ బోల్తా పడింది. సరుగుడు కర్రలతో వెళ్తున్న లారీ సెంటర్‌ వద్ద కల్వర్టు వద్ద రంధ్రంలో వెనక చక్రాలు పడిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. తెల్లవారు సమయం కావడంతో సమీపంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కల్వర్టు వద్ద ఏర్పడిన గుంతను సుమారు నాలుగు సంవత్సరాల నుంచి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు తెలిపారు.