Aug 15,2023 20:21

లాన్‌జాన్‌బాషాకు నివాళి

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు ఎస్‌ఎం లాల్‌ జాన్‌ బాషా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి షేక్‌ రఫీ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నాయకులు షేక్‌ రూబీ, ఫిరోజ్‌, గౌస్‌ బాషా, నాగూర్‌, చవిడిబోయిన వెంకటకష్ణ ఉన్నారు.