ప్రజాశక్తి-పొదిలి : పేదల ఆకలి తీర్చేందుకు లాల్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీ యమని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. స్థానిక చిన్న బస్టాండ్ సెంటర్‌లోని మసీదు వద్ద లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి రోజు పేదలకు ఆహారం అందిండచం ఎంతో వ్యవ ప్రయాలతో కూడిన విషయమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ అధినేత ఆకీబ్ అహమ్మద్, ముల్లా జిలానీ బాషా, షేక్ షర్మిల, మస్తాన వలి తదితరులు పాల్గొన్నారు.
లస్సీపంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల పాత ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ముస్లిం సోదరులకు లస్సీ పంపిణీ చేశారు. లస్సీ స్టాల్‌ను పొదిలి సిఐ రోఘవేంద్రరావు, పొదిలి ఎస్‌ఐ మల్లికార్జున, కొనకనమిట్ల ఎస్‌ఐ దీపిక ప్రారంభించారు. హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఫొటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రావూరి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు రాయల్, ట్రెజరర్ అశోక్, సెక్రెటరీ వెంకట్రావు, సభ్యులు శ్రీను, చలపతి, బాల ప్రసాద్, కష్ణ, వి. శ్రీను, మల్లి, శివ, వెంకటేశ్వర్లు, సూరి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.










