Sep 26,2023 23:13

లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

లాడ్జిలో యువకుడు ఆత్మహత్య
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: నిరుద్యోగ బాధతో యువకుడు హదయ విదారకంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి న్యూ మారుతి నగర్‌ లోని జెకె లేవు అపార్టు మెంటు లో నివసిస్తున్న గోపి కుమారుడు కిషోర్‌ (27) ఉన్నత చదువులు చదువుకున్నాడు. తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆవేదనతో రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం వేకువజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్‌ నిర్మల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంతో రుయాకు తరలించారు. మతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.