రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న సిఐ
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:ప్రముఖ పర్యాటక కేంద్రమైన మండల కేంద్రంలోని అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడి బాబు లాడ్జిలు, రిసార్ట్స్,హౌటల్స్ విస్తతంగా తనిఖీ నిర్వహించారు.దొంగతనాలు, మద్యం సేవించి డీజే సౌండ్స్, గొడవలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని లాడ్జిల నిర్వాహకులకు సూచించారు. ఎవరైనా మద్యం సేవించి గొడవ చేస్తే అరకు పోలీసు స్టేషన్ కి తెలియపరచాలని చెప్పారు. అరకులోయ మెయిన్ రోడ్‌లో ట్రాఫిక్‌కు ఎటువంటి అంత రాయం కలగకుండా ఎక్కడికి అక్కడే పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సిఐ చెప్పారు.










