Aug 17,2023 20:36

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి-కందుకూరు :రైెతులకు వ్యవసాయం గిట్టుబాటుగా ఉండాలనే లక్ష్యంతో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి చెప్పారు. గురువారం కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో ధరల స్థిరీకరణపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉండాలని ఉద్ధేశ్యంతో అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లో పనిచేస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి చేతుల మీదుగా యూనిఫామ్‌ పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు. మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు మాదిగ పాల్గొన్నారు.