
రైతుల సేవలో సహకార బ్యాంక్
ప్రజాశక్తి - కాళ్ల
సహకార సంఘాలు చాలా వరకు రుణ వితరణ, ఇతర సేవలకే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని సంఘాలు రైతుల అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రైతుల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఈ కోవకు చెందినదే కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. చిన్న సంఘమైనా సేవల్లో ముందుంటూ రైతులు, ప్రజల మన్ననలు పొందుతోంది. కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం 45 ఏళ్ల నుంచి ఏ గ్రేడ్ తరగతి సొసైటీగా పేరుగాంచి ప్రగతి పథంలో పయనిస్తోంది. 27 ఏళ్లుగా సభ్యుల నుంచి రికవరీలో ప్రథమ స్థానం పొంది ఏటా అవార్డులు అందుకుంటోంది.
మంచి దృక్పాథంతో..
గ్రామీణ రైతులకు రుణాలు అందించే 1939లో పెన్మత్స వెంకట సోమరాజు కాళ్లకూరు సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. సొసైటీ మొదటి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 375 మంది సభ్యులతో ప్రారంభమైంది. 1939 నుంచి 1968 వరకు 29 ఏళ్ల పాటు ఏకధాటిగా ఏకగ్రీవంగా ఎన్నికై సొసైటీ అభివృద్ధికి తోడ్పడ్డారు. సంఘం తొలినాళ్లలో కేవలం రూ.వేలల్లో మాత్రమే లాభాలను ఆర్జించేది. సొసైటీ అధ్యక్షుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు, సభ్యుల సహకారంతో డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి.
లాభాల బాటలో...
ప్రస్తుతం 2,686 మంది సంఘ సభ్యులు ఉన్నారు. డిపాజిట్లు రూ.16, 12,82,432 షేర్ క్యాపిటల్ 1,01, 65,222 ఉంది. డిసిసిబిలో ఇన్వెస్ట్ మెంట్స్ రూ.4, 62,12,983, సంఘ రిజర్వ్ నిధులు 2,71,71,044, డిసిసిబి రిజర్వ్ నిధులు రూ.1,11,23,312, ఇతర డిపాజిట్లు రూ.40,73,259, డిసిసిబి బారో యింగ్స్ రూ.5, 28,65,236 సంఘం లాభాల బాటలో పయనిస్తోంది.
వార్షిక టర్నోవర్ రూ.35.74 కోట్లు
సహకార బ్యాంకులో రూ.35,74,13,194 వార్షిక టర్నోవర్ నడుస్తోంది. పంట రుణాలు, బంగారు ఆభరణాలు, చేపల మేత వివిధ రకాల రుణాలు మంజూరు చేస్తూ రైతులకు, ప్రజలకు చేయూతనిస్తూ రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటూ సొసైటీని సభ్యులు ముందుకు నడిపి స్తు న్నారు. కాళ్లకూరు, జువ్వల పాలెం, ఏలూ రుపాడు గ్రామా ల రైతులకు, ప్రజలకు సేవలందిస్తోంది. రైతులకు రూ.18. 99 కోట్లు (18,98,90,1 62)రుణాలు అందించారు.
మొబైల్ ఎటిఎం..
రైతులు, ప్రజల కోసం డిసిసిబి ద్వారా మొబైల్ ఎటిఎం ప్రతి శనివారం కాళ్లకూరులో అందుబాటులో ఉంటోంది. అన్ని రకాల ఎటిఎం కార్డులు ఈ మొబైల్ ఎటిఎంలో ఉపయోగించుకోవచ్చు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏలూరు ఆధ్వర్యంలో రూ.15 లక్షలతో మొబైల్ ఎటిఎం ఏర్పాటుచేసి కాళ్లకూరు సొసైటీ పరిధిలో ఉన్న కాళ్లకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు గ్రామ రైతులు, ప్రజలకు మంచి సౌకర్యాన్ని కల్పించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక స్వాలంభనకు సహకార బ్యాంక్ ఎంతో ఉపయో గపడుతుంది. డిపాజిట్లపై వడ్డీరేటు పది శాతం (ఏడాది కాలపరిమితి), బంగారు, ఆభరణాలపై 12శాతం రుణాలు అందిస్తుంది.
నూరుశాతం బాకాయిలు వసూలు
డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు చేతుల మీదుగా ఛైర్మన్ మాదు సురేష్, సెక్రటరీ ఇబ్బా శ్రీనివాస్ జా ్ఞపికను అందుకున్నారు. కాళ్లకూరు సొసైటీలో డిపాజిట్లు, రు ణాల పెంపుదల, ఇచ్చిన రుణాలు నూరుశాతం వసూలు, సొసైటీ పనితీరు, సొసైటీ ప్రగతిని పరిశీలించి ఈ అవార్డు అందించారు. 2022-23లో బ్యాంకు బకాయిలు నూరు శా తం వసూలు చేసి రూ.37,25,236 నికరలాభం వచ్చింది.
పెరిగిన డిపాజిట్లు
మాదు సురేష్ , త్రిసభ్య కమిటీ ఛైర్మన్, కాళ్లకూరు
సంఘం డిపాజిట్లు గతంలో రూ.10,50,93,000 ఉండేది. ప్రస్తుతం రూ.16,12,82,432 డిపాజిట్లు సేకరించాం. రూ.2,61,58,000 డిపాజిట్లు పెరిగాయి. సొసైటీ ద్వారా రైతులకు, ప్రజలకు విసృతత సేవలు అందిస్తాం.
రూ.37 లక్షలు నికర లాభం
ఇబ్బా శ్రీనివాస్, సొసైటీ కార్యదర్శి
సొసైటీ అధ్యక్షులు, సిబ్బంది సమిష్టి కృషితో సంఘం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. రైతులకు రూ.18.99 కోట్ల రుణాలు అందించాం. రూ.2,63,87,091 అప్పు పెరిగింది.