ప్రజాశక్తి -నక్కపల్లి:త్వరగతిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో సీతారామరాజు లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని ఉపమాకలో జగనన్న లేఔట్‌లో చేపడుతున్న గృహ నిర్మాణ పనులను శనివారం ఈఓపిఆర్‌డి వెంకటనారాయణ, హౌసింగ్ ఏఈ రాజులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. జగనన్న లేఅవుట్‌లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి అయ్యే విధంగా చూడాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్‌ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ:జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంకు కృషి చేయాలని ఎంపిడిఒ డేవిడ్‌రాజు తెలిపారు. శనివారం హౌసింగ్‌డే ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భగా ఎంపిడిఒ మాట్లాడుతూ గృహ లబ్ధిదారలకు సంబంధించిన ఇళ్లను సకాలంలో పూర్తి చేసేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీటి సదుపాయాలు, ఎలక్ట్రికల్ వంటివి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కోటవురట్ల:ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవాలని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ అన్నారు. శనివారం మండలంలో కొడవటిపూడి, చిన్న బొడ్డేపల్లి గ్రామాల్లో నిర్మితమవుతున్న జగనన్న కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,మెటీరియల్ అందుబాటులో ఉంచామని బిల్లులు సకాలంలో చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, చిన్న బొడ్డేపల్లి సర్పంచ్ శివరాం, కొడవటిపూడి సర్పంచ్ అప్పారావు హౌసింగ్ ఇంజనీర్ జగదీశ్వరరావు పాల్గొన్నారు.










