
ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక పండరీ పురము 2వ లైన్ లో గల ప్రజాసంఘాల కార్యాలయం వద్ద నుంచి శుక్రవారం నాడు సామాజిక న్యాయం కోసం విజయవాడలో జరుగు "మహాధర్నా" కార్యక్రమాన్ని జయప్రదం చేయుటలో తమ వంతు మద్దతుగా కె.వి.పి.ఎస్.జిల్లా సహాయ కార్యదర్శి ఎం.విల్సన్ ఆధ్వర్యంలో విజయవాడకు బైయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ దళితులపై దాడులు అత్యాచారాలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూడా దళితులను అత్యంత కిరాతకముగా చంపడం జరుగుతుందన్నారు. వీటికి వ్యతిరేకంగా దళితులకు సామాజిక న్యాయం చేయటం కోసం జరిగే మహాధర్నాను జయప్రదం చేయడానికి ఇక్కడ నుండి బయలుదేరమన్నారు. ఈ కార్యక్రమంలో పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతులూరి బాబు, సాతులూరి లూథర్, దళితులు, దళిత మహిళలు తదితరులు పాల్గొన్నారు.