ప్రజాశక్తి-కాకినాడ : కెవిపిఎస్ ఆవిర్భావ దినోత్సవం తేదీన సుందరయ్య భవన్ వద్ద కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ దళిత సంఘం సీనియర్ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు ఆవిష్కరించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘం సీనియర్ నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కే ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు ఆత్మ గౌరవంతో జీవించాలంటే, కోనేరు రంగారావు భూ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు. ఉపాధి కూలీలకు గ్రామాలలోనూ 200 రోజులు పనులు కల్పించి, వేతనం 600 రూపాయలు చొప్పున కూలీ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో 41 సిఆర్పిసి నోటీసులు తీసుకొని దోషులను విడుదల చేసే పద్ధతిని రాష్ట్రప్రభుత్వ ఆపివేయాలన్నారు. దళిత రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వత చట్టంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. నిధులు దారి మల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎసైన్డ్ భూమికి యాజమాన్య హక్కులు ఇవ్వటం అంటే దళితులకు భూమిని దూరం చేయటమే అన్నారు. ప్రభుత్వం అసైన్డ్ చట్ట సవరణలు నిలుపుదల చేయాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందాం తదితర డిమాండ్లపై డిసెంబర్ 4న ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సత్తా సీనియర్ బచ్చల కామేశ్వరరావు, నాయకులు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బుడితి సురేష్ కుమార్, ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.










