ప్రజాశక్తి-అల్లూరి : పెద కోడపల్లి సర్పంచ్ దివంగత మండల నేత సెగ్గే వెంజటరమణ అకాల మరణం తెలుసుకొన్న ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభరవిబాబు విజయవాడ నుండి నేరుగా బయలుదేరి శుక్రవారం ఉదయం బంగారు పుట్టు గ్రామానికి చేరుకున్నారు. సెగ్గే యొక్క ఇద్దరు భార్యలను 4 పిల్లలను పలకరించి ఓదార్చి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అదైర్యాపడవలసిన అవసరం లేదని పిల్లల్లా చదువుల విషయంలో జిల్లా కలెక్టర్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు. 2 ఏళ్లుగా వెంకటరమనతో పరిచయం ఉందని పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రమణ భార్య చిన్నతల్లిని ఎంపీటీసీగా గెపించుకొన్నాడని ప్రస్తుతం వెంకటరనే సర్పంచ్ గా గెలిచి నిత్యం ప్రజల సేవతోనే తపించేవాడని ఇప్పుడు మన మధ్య లేకపోవడం స్వంత కుటుంబానికి, వైస్సార్సీపీ పార్టీకి తీరని లోటన్నారు. అతని సేవసలు మరువరాదని అన్నారు. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యురాలు తడబరికి లిల్లీ మరియు అరకు పార్లమెంట్ కార్యదర్శి తడబారికి సురేష్ వ్యక్తిగతంగా వెంకటరమణ భార్య చిన్నతల్లికి 5000/ రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. అలాగే వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ట్రైకర్ డైరెక్టర్ శతక బుజ్జిబాబు ఎంపీపీ బోండా వరలమ్మా అరకు రాజకీయ నాయకుడు పాంగి రాజరావు, మాజీ ఎంపీటీసీ మజ్జి చంద్రుబాబు, స్థానిక ఎ పీ టి ఆర్ ఎ అధ్యక్ష కార్యదర్సులు ఎల్ విశ్వనాదం, పీ ఫాల్గుణ, తదితతులు పాల్గొన్నారు/










