Jul 25,2021 21:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుండి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతిఇవ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ కృష్ణానదీయజమాన్యబోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు లేఖ రాసినట్టు జలవనరుల శాఖ ఇఎన్‌సి నారాయణరెడ్డి తెలిరు. ఎగువ కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యామ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని ఈ లేఖలో పేర్కొన్నారు డ్యామ్‌లో నీటిమట్టం 870 అడుగలకు చేరుకుందని, అందువల్ల కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో జలవిద్యుత్‌ ఉత్పాదనకు అనుమతివ్వాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటిమట్టం పెరిగితే జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని లేఖలో పేర్కొంది..