
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో: కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల సమావేశం ఈ నెల తొమ్మిదిన కాకుండా మరో తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆయా బోర్డులను కోరింది. సుప్రీంకోర్టు, ఎన్‌జిటిలో కేసుల విచారణ ఉన్నందున తొమ్మిదో తేదీన హాజరు కాలేమని ఇరిగేషన్ ఇఎన్‌సి మురళీధర్ ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖ రాశారు. దీనిపై బోర్డుల నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. దీంతో, తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ డాక్టర్ రజత్‌కుమార్ ఆదివారం కెఆర్‌బిఎం, జిఆర్‌బిఎం చైర్మన్లకు వేర్వేరుగా లేఖలు రాశారు. మరో తేదీని ఖరారు చేస్తే హాజరై తమ అభిప్రాయాలు చెబుతామని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.