Oct 02,2023 16:34

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల తిరుపతిలో 20, 21, 22 తేదీల్లో జరగబోవు జూనియర్స్ ఖోఖో ఛాంపియన్షిప్ కు సోమవారం విజయనగరం జిల్లా ఖోఖో జట్లు  రాజీవ్ క్రీడా మైదానంలో ఎంపికలు నిర్వహించడం జరిగింది. .జిల్లా నుండి సుమారు బాలురు మరియు బాలికలు ఈ ఎంపికకు 300 మంది పైగా క్రీడాకారులు హాజరు కావడం జరిగింది. వీరిలో 18 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు గల విజయనగరం జిల్లా ఖోఖో జట్లు ను  సెలక్షన్స్ చేయడం జరిగింది ఎంపికకు ఖోఖో అసోసియేషన్ చైర్మన్ చిన్నమనాయుడు, సీనియర్ వ్యాయమ ఉపాద్యాయులు బాలకృష్ణ కమల, గోపాల్ సత్యనారాయణ, బైరెడ్డి శ్రీను, ప్రసన్న హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ ఎంపిక బాధ్యతను కార్యదర్శి చింత సత్యనారాయణ  పర్యవేక్షణ చేయడం జరిగింది.