ఖరీఫ్‌లో సబ్సిడీతో విత్తనాలు, మందులు ఇవ్వాలి
ప్రజాశక్తి-డోన్
ఖరీప్ సీజన్‌లో రైతులకు పూర్తిగా సబ్సిడీలతో విత్తనాలు, మందులు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లంక సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. సోమవారం డోన్ పట్టణంలోని స్థానిక సిపిఎం కార్యా లయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమావేశం మండల అధ్యక్షులు నాగ మద్దయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యతిదిగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లంక సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లంక సుబ్బారాయుడు, రైతు సంఘం మండల అధ్యక్షులు నాగమద్దయ్య,రైతు సంఘం మండల కార్యదర్శి వెంకట్రాముడులు మాట్లాడుతూ ఖరీప్ సీజన్ లో రైతులకు పూర్తిగా సబ్సిడీతో వేరు శనగలు,కందులు, అముదాలు, పత్తివిత్తనాలు, టమోటావిత్తనాలు,మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నష్ట పోయిన రైతులను తక్షణమే ఆదుకొని తడిసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి,దాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతూ ధరలు కల్పించాల న్నారు. రైతులను అప్పుల ఊబి నుండి రక్షించేందుకు కేరళ రాష్ట్రం తరహా ఋణ విముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు,రామానాయుడు, సర్వేశ్వరయ్య,శ్రీనివాసులు,మద్దిలేటి, ఆదినారాయణరెడ్డి,బొజ్జులు తదితరులు పాల్గొన్నారు.










