Aug 11,2023 20:40

ఆగస్టు రెండో వారం గడుస్తున్నా పూర్తికాని నాట్లు
ఏలూరు జిల్లాలో ఇంకా 80 వేల ఎకరాల్లో పడని నాట్లు
'పశ్చిమలో'నూ ఇంకా పూర్తికాని 30శాతం నాట్లు
వర్షాలు లేక, నీరందక సమస్య తీవ్రతరం
బీటలు వారుతున్న కృష్ణా ఆయకట్టు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతిఁధి
ఖరీఫ్‌ సాగు కష్టాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదిలోనే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో నాట్లు కూడా ముందుకఁ సాగఁ దుస్థితి నెలకొంది. ఆగస్టు రెండో వారం గడుస్తున్నా ఇప్పటికీ రెండు జిల్లాల్లోనూ దాదాపు లక్షకఁపైగా ఎకరాల్లో నాట్లు పూర్తికాఁ పరిస్థితి నెలకొంది. దీంతో నాట్లు పూర్తయ్యేదెప్పుడో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏలూరు జిల్లాలోని కృష్ణా ఆయకట్టు రైతులు నీటిఎద్దడి సమస్యతో నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో 2.17 లక్షల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. జూన్‌ ఒకటో తేదీనే కాలువలక సాగునీరు విడుదల చేసి ముందస్తు ఖరీఫ్‌సాగుకఁ అధికారులు ప్రణాళికలు రచించారు. పరిస్థితి మాత్రం అందుకఁ విరుద్దంగా కొనసాగుతోంది. తొలుత ఎండల తీవ్రత, తర్వాత ఎడతెరిపిలేఁ వర్షాలతో ఖరీఫ్‌సాగుకఁ తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో సాగునీటి సమస్య రైతులను వెంటాడుతోంది. దీంతో ఖరీఫ్‌ నాట్లు ముందుకు సాగని పరిస్థితి. ఏలూరు జిల్లాలో ఇంకా 80 వేలకఁపైగా ఎకరాల్లో నాట్లు పూర్తికాఁ పరిస్థితి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 2.17 లక్షల ఎకరాల సాగుకఁగాను ఇంకా 30 శాతానికిపైగా సాగులో నాట్లు ఇంకా పూర్తి కాలేదు. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఎండల తీవ్రతకఁ నాటిన నాట్లు కూడా రేణింపు ఉండటం లేదు. దీంతో రైతులకఁ ఏం చేయాలో తెలియక తీవ్రంగా నలిగిపోతున్నారు. దెందులూరు ఁయోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుండుగొలను వద్ద ఏలూరు కాలువపై బ్రిడ్జి నిర్మాణం కారణంగా కాలువకు అడ్డుకట్ట వేసినట్లు చెబుతున్నారు. అందువల్ల దెందులూరు ఁయోజకవర్గంలో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించకపోతే వరిపొలాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.
బీటలు వారుతున్న కృష్ణా ఆయకట్టు
ఏలూరు జిల్లాలోఁ కృష్ణా ఆయకట్టు రైతులు సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌లో కృష్ణా ఆయకట్టు పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకఁపైగా వరిసాగు రైతులు చేస్తున్నారు. వీరికి నీటిఎద్దడి కారణంగా రబీలో వరిసాగు ఉండదు. ఖరీఫ్‌ సాగునే ప్రధాన ఆధారం. దాదాపు 80 శాతం వరకూ నాట్లు పూర్తయ్యాయి. నీటిఎద్దడి సమస్య వెంటాడుతుండటంతో పొలాలు బీటలు వారి దెబ్బతింటున్నాయి. దీంతో రైతులకఁ ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కృష్ణా నదిలో జలాలు అడుగంటడంతో పట్టిసీమ ద్వారా కృష్ణా ఆయకట్టుకఁ సాగునీరు పంపిస్తున్నారు. ఆ నీరు కృష్ణా కాలువ ద్వారా పెదపాడు, దెందులూరు నియోజకర్గంలోని కృష్ణా ఆయకట్టుకఁ చేరాల్సి ఉంది. కృష్ణా కాలువ ఆధుఁకీకరణ లేకపోవడంతో సాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. సాగునీరు అందక పొలాలు బీటలు తీయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీఁపై జిల్లా అధికారులు, ప్రజాప్రతిఁధులు వెంటనే జోక్యం చేసుకుని పంటలను కాపాడాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. నాట్లను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.