
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా ): జిల్లాలో 2023-24 ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుల నుండి ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేయలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ సంబంధిత అధికారులకు సూచించారు.మంగళ వారం కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లా వ్యవసాయ, సివిల్ సప్లైస్ ,ధాన్యం కొనుగోలు ఏజెన్సీ హెడ్స్, కృష్ణా జిల్లా రైస్ మిల్లర్లు మరియు ధాన్యం రవాణా కాంట్రాక్టర్లుతో ఖరిప్ ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే ధాన్యం సేకరణకు అవసరమైన మేర గోనె సంచులు ముందుగానే గోదాములలో నిల్వ చేయాల్సిందిగా రైస్ మిల్లర్ల ను ఆదేశించారు. ధాన్యం సేకరణ సజావుగా జరిగేందుకు బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని వారిని ఆదేశించారు. రైస్ మిల్లులలో గల మోయిస్చార్ మీటర్లు అన్ని కాలిబ్రేషన్ జరగాలన్నారు. రైస్ మిల్లర్లకు రావాల్సిన బకాయిలను త్వరలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీ హెడ్స్ అందరు కూడా అవసరమైన మేర సిబ్బందిని నియాకమించి రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రములలో మోయిస్చార్ మీటర్లు, ధాన్యం విశ్లేషించు పరికరములు అన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలో ఈ-క్రాప్ మరియు ఈకెవైసి త్వరలోనే ముగుస్తున్నందున రైతులు అందరు ఈకెవైసి చేయించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ డాక్టర్ ఎ.శ్రీధర్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్ పద్మావతి, మరియు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.