
ఖోఖో పోటీల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి
ప్రజాశక్తి - పగిడ్యాల
రాష్ట్రస్థాయి జరిగే ఖోఖో పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి క్రీడాకారులకు సూచించారు. బుధవారం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో జట్టుకు శిక్షణ శిబిరాన్ని నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్యాల నాగిరెడ్డి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియన్ ఆధ్వర్యంలో ఖోఖో జట్టుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 19 నుంచి చిత్తూరు జిల్లా యాదమర్రి లో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీ లో పాల్గొని ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి మొదటి బహుమతి గెలుపొందే విధంగా శిక్షణ ఇవ్వాలని వ్యాయామ ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. మనోధైర్యం పట్టుదలతో పాటు క్రీడా స్ఫూర్తి కలిగినప్పుడే విజయం సాధించవచ్చు అని క్రీడాకారులకు ఆయన సూచించారు. విద్య కోసం , క్రీడల కోసం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ అయినప్పటి నుంచి సిఎం జగనన్న సహకారంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీధర్ కుమార్, క్రీడా శ్రీ తోకల పీతాంబ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు.