
తెనాలి: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జూనియర్ సివిల్ జడ్జి పి. రాజశేఖర్ అన్నారు . శనివారం కొత్తపేటలోని సబ్ జైలును శనివారం ఆయన సందర్సించి, ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి తెలుసు కున్నారు. అలాగే వారికి అందించే ఆహారాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా ఉచిత న్యాయ సేవలు, సలహాలు అవసరమైతే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పొందవచ్చు నన్నారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది అప్పల కిశోర్, మండల లీగల్ సర్వీసెస్ తరఫున మెహబూబ్, సరళ పాల్గొన్నారు.