Nov 15,2023 21:58

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జైలుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో 17 పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత తెలి పారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పెట్రోల్‌ బంకుకు, కేంద్ర కారాగారం డిఐజి కార్యాలయం సమీపంలో రూ.50 లక్షలతో ప్రాంతీయ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వనిత, ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భం గా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖలో 17 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసి, ఖైదీల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసు కోవడం జరుగుతోం దన్నారు. ఒక్కొక్క ఖైదీకి రోజుకి రూ.200 చొప్పున వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలి పారు. సెంట్రల్‌ జైలు సమీపంలో 60 ఎకరాల విస్తీర్ణం లో రు. 50 లక్షల తో నిర్మించనున్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జైలు శాఖ కార్పస్‌ నిధులతో ఇండియన్‌ ఆయిల్‌, హెచ్‌పిఎల్‌ సంస్థల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యో గం చేసేందుకు పెట్రోల్‌ బంకులు నిర్వహించడం జరు గుతుందన్నారు. పెట్రోల్‌ బంక్‌ నుంచి వచ్చే ఆదాయా న్ని కార్పస్‌ ఫండ్‌ కు జమ చేయడమే కాకుండా జైలు అభి వృద్ధికి వినియోగించడం జరుగుతుందని మంత్రి తెలి పారు. జైళ్లు శాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, ఈ నిర్మాణానికి రెండవ దశలో మరికొన్ని నిధు లు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిసన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్స్‌ హరీష్‌ కుమార్‌ గుప్తా, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌ ఐ.శ్రీనివాసరావు, డిఐజి (కోస్తాంధ్ర ప్రాంతం) యంఆర్‌.రవి కిరణ్‌, సూపరింటెం డెంట్‌ ఆఫ్‌ జైల్స్‌, ఎస్‌. రాహుల్‌, ఎస్‌పి పి.జగదీష్‌, పాల్గొన్నారు.