ప్రజాశక్తి - పాలకొండ : సబ్ జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ అధారిటీ చైర్మన్ పిఎస్‌విబి కృష్ణసాయితేజ్ అన్నారు. శనివారం స్థానిక సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలు సూపరింటెండెంట్ బి.జోగులుకు అక్టోబర్ 2న గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవ సందర్భంగా రిమాండ్ ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ జైల్లో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమాండ్ ఖైదీల కాఫీలు పరిశీలించారు. జైలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు కోర్టు సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు, ప్యానెల్ అడ్వకేట్ ఎం.వెంకటేశ్వరరావు, జైలు సిబ్బంది ఉన్నారు.










