Sep 11,2023 23:53

ప్రజాశక్తి - పర్చూరు
మండలంలోని ఉప్పుటూరుకు చెందిన జ్యోతిష్య, సంఖ్యా శాస్త్ర, వాస్తు నిపుణులు షేక్ అహమద్ ఖాసీం సాహెబ్‌కు అంతర్జాతీయ జ్యోతిష్య జ్ఞాన రత్న అవార్డు లభించింది. 23సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన చేసిన వాస్తు సేవలకు గుర్తుగా అవార్డు ప్రదానం చేసినట్లు ఆయన సోమవారం తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో అంతర్జాతీయ జ్యోతిష్య ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ అనంతశర్మ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నట్లు తెలిపారు. ఖాసీం సాహెబ్ కు అవార్డు రావటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో డాక్టర్ హరిహరన్, డాక్టర్ కె విద్య పాల్గొన్నారు.