కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న నిరుద్యోగులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను రద్దుచేయాలని కోరుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీపోస్టులు భర్తీ చేయకపోవడంతో లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఏటా డిఎస్‌సి తీస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. వెంటనే మెగా డిఎస్‌సికి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ధర్నాలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.సతీష్, డిఎస్‌సి అభ్యర్థులు పాల్గొన్నారు.










