Jun 12,2023 23:51

నిరసన తెలుపుతున్న మహిళలు

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని గుమ్మకోట పంచాయతీ పరిధి గొట్టలపాడు గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కోయిల్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యన గ్రావిటీ నుండి గ్రామం వరకు ఏర్పాటు చేసిన పైపులైన్‌ మరమ్మతుకు గురైందని, దీంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు తెలిపారు. అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాదుడే కరువయ్యారని తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి పైపుల మరమ్మత్తు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు రాములమ్మ, .గంగమ్మ, పైడితల్లి పాల్గొన్నారు.