May 08,2023 21:53

     జంగారెడ్డిగూడెం: ప్రతిఏటా వేసవిలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని మహిళలు ఖాళీ బిందెలతో మండలంలోని నాగులగూడెం గ్రామస్తులు రోడ్డుపై  సోమవారం నిరసన తెలిపారు. గ్రామంలో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా చేసే నీటిని సకాలంలో విడుదల చేయడం లేదని మహిళలు వాపోయారు. కూలీనాలి చేసుకునే పేదలు సకాలంలో నీటి సరఫరా లేకపోవడం వల్ల ఉపాధిని కూడా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టిసారించి నాగులగూడెంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు నాగలక్ష్మి, పోచమ్మ, గంగారత్నం, మణికుమారి, కుమారి పాల్గొన్నారు.