Feb 09,2023 23:52

ఆందోళన చేపడుతున్న మహిళలు

ప్రజాశక్తి-పాడేరు: తాగునీటి సమస్యపై చింతపల్లి మండల కేంద్రంలోని ఆర్‌ డబ్ల్యుఎస్‌ కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రంలోని సాయి నగర్‌, మెట్ట బంగ్లా, ఐటిడిఏ క్వార్టర్స్‌, ప్రాంతాలకు గత కొన్ని నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని, దీంతో మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నామని సిపిఎం ఒకటవ వార్డ్‌ మెంబర్‌ బోనంగి పుష్పవతి తెలిపారు. ప్రతిరోజు నీటి సరఫరా చేయలేదని, అధికారులకు పలుమార్లు చెబుతున్నా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సక్రమంగా ప్రతిరోజు మంచినీటి సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.