Jan 08,2023 00:36

ఆందోళన చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్‌:తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండలంలోని చెట్టుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళిత మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ, ఎస్సీ కాలనీలో సుమారు నెల రోజులుగా మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నామని, అధికారులకు గోడు వినిపించినప్పటికీ పట్టించు కోలేదన్నారు. ఎస్సీ కాలనీలో మురుగునీటి కాలువల్లో పూడిక తీయలేదన్నారు. దీంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌, ఆర్డీవో, ఎంపిడిఒలకు విన్నవించినా స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని నర్సీపట్నం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుపరాల రాంతల్లి, కుపరాల దారాలమ్మ, పుడతా లక్ష్మి, మారుతి రమణమ్మ, కుపరాల దేవమ్మ, కుపరాలు అచ్చియ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.