ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కింజేరు గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు, మహిళలు వర్షంలో ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ మాట్లాడుతూ, కింజేరు గ్రామంలో 130 కుటుంబాలు ఉండగా తాగునీటి సౌకర్యార్థం రూ.23లక్షల వ్యయంతో మంచినీటి పథకంను నిర్మించారన్నారు. గత మూడు నెలల నుంచి మరమ్మతుకు గురవడంతో గ్రామ సమీపంలోని పొలంలోని ఊటగెడ్డ నుంచి కలుషితమైన్న బురద నీరు ఉపయోగిస్తున్నారని చెప్పారు. మంచి నీటి పథకంను మరమ్మతులు చేపట్టి గ్రామంలో అమర్చిన కొలాయిల ద్వారా నీరు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్. కే.దాసు, పాంగి మోహన్‌దాస్, కె.సన్యాసిరావు, ఆనందరావు, పి.అర్జున్, రాద, సుశీల, గ్రామస్తులు పాల్గొన్నారు.










